ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (13:04 IST)

ఒక్క పూట భోజనం కోసం వ్యవసాయం చేయనంటున్న మన్మథుడు (ట్రైలర్)

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం "మన్మథుడు-2". గతంలో వచ్చిన 'మన్మథుడు'కు ఈ చిత్రం సీక్వెల్. ఈ చిత్రం 17 యేళ్ళ క్రితం వచ్చింది. నాగ్ కెరీర్లో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఫలితంగా సూపర్ డూపర్ హిట్. 
 
ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. దీనికి మన్మథుడు-2 అని పేరు పెట్టగా, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. కీర్తి సురేష్, సమంతల ప్రధానపాత్రలను పోషిస్తున్నారు. 
 
ఈ టీజర్ అదిరిపోయేలా ఉంది. ఒక్క పూట భోజనం చేయడానికి నేను వ్యవసాయం చేయను అంటూ నాగార్జున పలికే డైలాగ్ అదిరిపోయింది. అంతేకాదు నా జీవితం నా కోస‌మే నేను పిల్ల‌ల‌ను క‌న‌ను అంటూ మ‌రో న్యూస్ కూడా చెప్పాడు. 
 
ఓ వైపు కామెడీ మ‌రోవైపు రొమాన్స్ ఇంకోవైపు సెంటిమెంట్.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టి మిక్స్ చేసి ఈ ట్రైల‌ర్ విడుదల చేశారు. వెన్నెల కిషోర్‌తో వ‌చ్చే సీన్స్ కూడా చాలా ఫ‌న్నీగా అనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నాగార్జున లిప్‌లాక్ సీన్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో అక్కడక్కడా ద్వంద్వార్థాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ముదురు మన్మథుడుగా నాగార్జున పిల్ల కోసం పడే తిప్పలు కామెడీని తెప్పించాయి.