శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 జులై 2019 (14:28 IST)

ఈ నెల 9న ‘మన్మధుడు 2’లో అవంతిక లుక్ రిలీజ్... ఇంత‌కీ అవంతిక ఎవ‌రు..?

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మరియు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ హీరోయిన్‌గా మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న మన్మధుడు-2లో ఆయన సరసన జతకడుతోంది. 
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే టీజర్లో హీరోయిన్ పాత్రను మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు తమ చిత్రంలో అవంతికగా నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
 
2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన రొమాంటిక్ మూవీ మన్మథుడు‌కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రొమాంటిక్ స్టయిల్లో మంచి ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్. 
 
అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండగా సీనియర్ నటి లక్ష్మి, నాజర్, వెన్నెల కిశోర్, రావు రమేష్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం.