మన్మథుడు 2 టీజర్ వచ్చేస్తుంది. ఎప్పుడో తెలుసా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. ఈ చిత్రానికి చి ల సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మన్మథుడు 2 చిత్ర యూనిట్. ఈ నెల 13న మధ్యాహ్నం 1 గంటకి టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు నెలాఖరున రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా తెలియచేయనున్నారు.