నిరుద్యోగులకు జగన్ గుడ్‌న్యూస్ : గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఓ శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 4 లక్షల గ్రామ వాలంటర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుదారుని వయసు 18 నుంచి 39 యేళ్లలోపు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను జూలై నెలాఖరులోపు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకుంటే, అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితాను ఆగస్టు 15వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది.
ఈ గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను 72 గంటల్లో పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల లబ్ది పొందేలా అనుమతి మంజూరు చేస్తారు.