శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (14:15 IST)

కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారాం....!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసినట్టు సమాచారం. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. 
 
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఆయన ఎన్నికయ్యారు. పైగా, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం ఇది ఆరోసారి. కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం మంచి వక్త. అటు రాజకీయంగా, ఇటు పాలనపాపరంగా ఎంతో అనుభవం ఉంది.
 
దీంతో ఆయన్ను కొత్త సభాపతిగా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. మరోవైపు, ఏపీ కొత్త మంత్రివర్గం 8వ తేదీన కొలువుదీరనుంది.
 
మరోవైపు, ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే అయిన చిన్న అప్పలనాయుడికి అవకాశం ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. దీంతో స్పీకర్‌గా తమ్మినేనికి అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.