1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Butta Bomma Song Making Video

బుట్టబొమ్మ కంపోజింగ్ అదిరిందమ్మా...

Butta Bomma Song Making Video
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రంలోని పాటలు జనవరి ఆరో తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, అల వైకుంఠపురంలో సినిమాలోని సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. బుట్టబొమ్మ సాంగ్‌తో మొత్తం నాలుగు సాంగ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ నాలుగు కూడా ఆకట్టుకున్నాయి. ఇందులో రాములో రాములా సాంగ్, సామజవరగమన పాట సూపర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు బుట్టబొమ్మ సాంగ్ కూడా మంచి విజయం సాధించింది.
 
ఇక ఇదిలావుంటే, ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్‌కు సంబంధించిన చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే పై షూట్ చేసిన ఈ సాంగ్ ఎంత స్టైలిష్‌గా ఉంటుందో మేకింగ్ వీడియో చెప్పకనే చెప్తున్నది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కలెక్టర్ భార్య గాత్రానికి ఫిదా అయిన తమన్.. సినిమాల్లో పాడే ఛాన్స్