1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Case against Allu Arjun will be withdrawn: Revathi husband

అల్లు అర్జున్ పైన పెట్టిన కేసు ఉపసంహరించుకుంటా: రేవతి భర్త

Revathi husband
Revathi husband
డిసెంబర్  4వతేదీ రాత్రి హైదరాబాద్ లోని క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేటర్ లో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటలో అభిమాని రేవతి దుర్మరణం చెందగా, కొడుకు శ్రీతేజ తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం శ్రీతేజ ఇంకా ఆసుప్రతిలోనే వున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ ను 14రోజుల రిమాండ్ పై చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారన్న వార్త తెలుసుకున్న ఆయన మీడియాతో ఈ విదంగా మాట్లాడారు.
 
రేవతిభర్త మాట్లాడుతూ, అల్లు అర్జున్ సినిమా చూడాలంటే నా కొడుకును సంధ్య థియేటర్‌కు తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చారు. అందులో ఆయన తప్పేమీలేదు. నాకు పోలీసులు కూడా అరెస్ట్ గురించి సమాచారం చెప్పలేదు. ఈ కేసుకు అల్లు అర్జున్‌కు సంబంధంలేదు. ఏదైనా వుంటే నేను కేసును వాపసు తీసుకుంటానని చెప్పారు. కాగా, రేవతి భర్త చెపుతున్నప్పుడు ఆయన వెనక వున్నది మఫ్టీ పోలీసులా, మరెవరా అనేది చర్చనీయాంశంగా మారింది.
తర్వాతి కథనం
Actor Allu Arjun Sent To Judicial Custody ... చంచల్‌గూడ జైలుకు పుష్పరాజ్!!