బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (16:09 IST)

మోహన్ బాబుకు షాకిచ్చిన హైకోర్టు - ఏక్షణమైనా అరెస్టా?

mohan babu
సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. మీడియాపై దాడి కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదుకాగా, ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబున్నాయి. 
 
హీరో అల్లు అర్జున్ అరెస్టు 
 
హైదరాబాద్ నగరం, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో ఈ నెల 5వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరించే నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌‍కు తీసుకెళ్లి విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేశారు. 
 
'పుష్ప-2' చిత్రం ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్‌పై కేసు నమోదైవున్న విషయం తెల్సిందే.