నా కంటికి తగిలితే నేను గుడ్డివాడినయ్యేవాడిని : మోహన్ బాబు (video)
నేను మా ఇంటి దగ్గర వీడియో విలేకరిపై దాడిచేశానని అంటున్నారు. అందుకు నేనూ చాలా బాధపడ్డాను. అతను నా మొహంపై కెమెరా పెట్టారు. అది నా కంటికి తగిలింది. నేను తప్పుకున్నాను. కానీ తగిలితే గుడ్డివాడిని అయ్యేవాడిని. ఆ తర్వాత ఎవరిని నేను ప్రశ్నించగలను. నేను మీడియా రాగానే నమస్కారం పెడుతూ వచ్చాను. రాగానే ఓ విలేకరి మొహంపై మైక్ పెట్టాడు. అది కంటికి తగిలింది. అందుకే దురుసుగా ప్రవర్తించాను. ఇందుకు అతనికి గాయమైంది అన్నారు. అందుకు నేను చాలా బాధపడుతున్నా. వారి కుటుంబానికి నేను చెబుతున్నాను. నేను కొట్టాల్సి వచ్చింది. అని గురువారంనాడు ఓ ఆడియో విడుదల చేశారు మోహన్ బాబు.
నా ఏకాగ్రతను భంగం కలిగించారు అందుకే కొట్టాను. మీడియా వారు వేరే వారి ఇంటికి వెళ్ళి దూరితో ఊరు కుంటారా? మీరే చెప్పండి. అతనికి గాయమైనందుకు చింతిస్తున్నాను. దానివల్ల లాభం ఏమిటి? అని మీరు అగడవచ్చు. అతను టీవీ 9 విలేకరా? బయట వ్యక్తులా? అది ఎలా తెలుస్తుంది. నేను అందరికీ కావాల్సిన వాడిని..నేను చేసింది న్యాయమా? అన్యాయమా? మీరే చెప్పండి. నా ఇంటి తలుపు కొట్టి లోపలికి రావడం న్యాయమా? మీరే చెప్పండి అంటూ తెలిపారు.