ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (10:55 IST)

Laksmi Prasanna opinion: మంచు లక్ష్మీ ప్రసన్న ఆంతర్యం ఏమిటి?

Lakmi Prasanna manchu
Lakmi Prasanna manchu
మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం గురించిన రచ్చ అందరికీ తెలిసిందే. అయితే కుటుంబంలో మంచు విష్ణు, మనోజ్, మోహన్ ల మధ్య గొడవలు అనేది పైకి కనిపించే విషయంగా వుంది. కుటుంబంలో భాగమైన మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ఎవరూ ప్రస్తావించలేదు. మహిళగా ఆమెను ఇన్ వాల్వ్ చేయడం ఎందుకని అందరూ అనుకున్నారు. మనోజ్, మౌనికల పుత్రిక వేడుక జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటిలో జరిగినప్పుడు లక్ష్మీప్రసన్న కూడా హాజరై వేడుక చేసుకున్నారు.
 
కాగా, తాజాగా లక్ష్మీప్రసన్న ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆంగ్ల రచయిత మార్కస్ ఆరేలియస్ కోట్ చేసిన కొటేషన్... ప్రపంచంలో ఏదీ మీకు చెందనప్పుడు, మీరు ఏమి కోల్పోతారని భయపడుతున్నారు అని పోస్ట్ చేసింది. దీని అర్థం ఏమిటో డీప్ లో ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు మనోజ్ పెండ్లికి లక్ష్మీప్రసన్న బాగా సపోర్ట్ చేసింది. కానీ మోహన్ బాబుకు ససేమిరా ఇష్టం లేదు. కానీ ఫైనల్ గా పెండ్లికి రావడం ఆశీర్వదించడం జరిగింది. మంచు కుటుంబంలో మనోజ్ తన సమస్యలన్నింటినీ లక్ష్మీ ప్రసన్న ముందు పంచుకునేవారు. ఇప్పుడు ఆమె చేసిన కొటేషన్.. ఎవరికనేది మీరే తెలుసుకోండని వదిలేసింది. 
 
ఇక దీనినిచూశాక కొందరయితే, తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీలోని హేమాద్రినాయుడు అతని అనుచరులు చుట్టుపక్కల హాస్టల్ విద్యార్థులను బెదిరించి లక్షలు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి అంటూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు యూనిర్శిటీలోని విషయాలను, అవకతవలను తనకు ఫోన్లో చెప్పి బాధపడ్డారని అందుకే వారికోసమే నేను చేసే పోరాటమనీ, మా నాన్న దేవుడు అంటూ వివరించారు. మొత్తంగా చూస్తే, మోహన్ బాబు చుట్టూరా ఓ కోటరి వుందనీ వారే ఆయనకు తెలీయకుండా చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారనేది? ప్రశ్నార్థకంగా మారింది.