సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 31 జులై 2023 (10:32 IST)

చంద్రముఖి 2 రాఘవ లారెన్స్ తాజా లుక్

Chandramukhi 2-  Lawrence
Chandramukhi 2- Lawrence
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. ఇటీవలే ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి కీరవాణి సిద్ధం అయినట్లు పోస్ట్ చేశారు. నేడు చంద్రముఖి 2 రాఘవ లారెన్స్ పవర్ ఫుల్ యాక్షన్ లుక్ ను విడుదల చేసింది. ఇది పి. వాసు రచన, దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. చంద్రముఖి 2 అనేది రజనీకాంత్, జ్యోతిక నటించిన చంద్రముఖికి సీక్వెల్.
 
మహిమ నంబియార్, లక్ష్మీ మీనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ వినాయక చవితికి తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు కామిడీ హారర్ చిత్రం గా ఇదే ఉండబోతుంది. రాఘవ లారెన్స్ సెంటిమెంటుగా ఆర్ఫాన్స్ గురించి ఓ పాయింట్ టచ్ చేస్తున్నట్లు తెలిసింది.