గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జులై 2023 (13:51 IST)

మరణ భయంతో నిద్రలేని రాత్రులను గడిపిన ఎంఎం కీరవాణి?

keeravani
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణికి మరణ భయం పట్టుకుంది. దీంతో ఆయన నిద్రలేని రాత్రులు గడిపారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన "చంద్రముఖి". అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత "చంద్రముఖి-2" మూవీ దర్శకుడు వాసు తెరకెక్కించారు. 
 
రజనీకాంత్ స్థానంలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తుండగా.. ఈసారి చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. చంద్రముఖి- 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం.కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
 
తాజాగా, 'చంద్రముఖి-2' సినిమా గురించి కీరవాణి ఆసక్తికర ట్వీట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ "చంద్రముఖి-2" చూడడం జరిగింది. సినిమాలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఇక ఆ సన్నివేశాలకు నా మనసుకు హత్తుకునేలా సంగీతంతో జీవం పోయడానికి నాకు 2 నెలలు పట్టింది. నేను కూడా 2 నెలలు నిద్ర లేని పగలు, రాత్రులు గడిపాను. గురుకిరణ్, నా స్నేహితుడు విద్యాసాగర్ దయచేసి నాకు శుభాకాంక్షలు తెలపండి"అంటూ రాసుకొచ్చారు.