గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (12:57 IST)

చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

suicide
చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థిని శవమై కనిపించిందని.. ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే.. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‍‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ మద్రాస్‌లో 32 ఏళ్ల ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.