మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:32 IST)

గుండెపోటుతో ఆగిన మరో చిట్టి గుండె.. అమెరికాలో డాక్టరై వస్తాడనుకుంటే..?

heart stroke
గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా కరేబియన్ దీవుల్లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మంగళవారం గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం, సాయిప్రభాత్ నగర్‌కు చెందిన రవికుమార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్‌ శివరామకృష్ణ (20) అమెరికాలోని బార్బడోస్‌లో హేమంత్‌ అక్కడ ఎంబీబీయస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 
 
స్నేహితులతో కలసి మంగళవారం బీచ్‌కు వెళ్లిన హేమంత్‌ .. ఈతకు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికి గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హేమంత్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.