సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:52 IST)

హుస్నాబాద్‌‌లో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

ఇటీవలికాలంలో ఉన్నట్టుండి గుండెపోటులకు గురై మృత్యువాత పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. క్రీడలు ఆడుతూ చనిపోతారు. మరికొందరు కూర్చొనివున్న చోటే మృత్యువాతపడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 
తాజా తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట హుస్నాబాద్‌లో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలో జరుగుతున్న కేఎంఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో శనిగరం ఆంజనేయులు (37) పాల్గొన్నారు. 
 
ఈ క్రమంలో బౌలింగ్‌ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడి స్వస్థలం చిగరుమామిడి మండలం సుందరగిరి. ఈ ఘటనతో హుస్నాబాద్‌లో విషాదం నెలకొంది.