బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (12:52 IST)

కోవిడ్‌తో ఊపిరితిత్తుల మార్పిడి.. జార్ఖండ్ మంత్రి మృతి

Jharkhand Minister
Jharkhand Minister
కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన 2 సంవత్సరాల తర్వాత జార్ఖండ్ మంత్రి జాగర్నాథ్ మహ్తో మరణించారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జాగర్నాథ్ మహ్తో మరణాన్ని ధృవీకరించారు మంత్రి మృతి "కోలుకోలేని నష్టం" అని పేర్కొన్నారు. 
 
భగవంతుడు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ కష్టమైన శోకాన్ని భరించే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. 
 
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహ్తో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. 56 ఏళ్ల నాయకుడికి నవంబర్ 2020లో కోవిడ్ సోకిన తర్వాత ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది.
 
గిరిదిహ్‌లోని డుమ్రీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన మిస్టర్ మహ్తో గత నెలలో రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో అనారోగ్యం పాలవడంతో చెన్నైకి విమానంలో తరలించారు.