12వ భార్యను కొట్టి చంపిన భర్త.. ఎక్కడ?
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కిరాతక భర్త తన 12వ భార్యను కర్రతో కొట్టి దారుణంగా చంపేశాడు. గయాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్‌దార్ పంచాయితీ తారాపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర, సావిత్రీదేవి అనే దంబతులు ఉన్నారు.
రామచంద్ర ఆదివారం మద్యం తెచ్చుకుని ఇంట్లోనే తాగుతున్నాడు. ఆ సమయంలో భార్య సావిత్రీదేవితో అతనికి గొడవ జరిగింది.
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రామచంద్ర.. భార్యపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సావిత్రీదేవి.. అక్కడికక్కడే మృతి చెందింది.
'నిందితుడు రామచంద్రకు ఇప్పటివరకు 12 పెళ్లిళ్లు అయ్యాయి. సావిత్రీ దేవి 12వ భార్య. ఆమెకు ఇది వరకే పెళ్లైంది.
రామచంద్రతో గొడవ పెట్టుకుని మిగతా 11 మంది భార్యలు.. అతణ్ని విడిచిపెట్టి వెళ్లారు.
రామచంద్రకు పిల్లలు లేరు. సావిత్రీదేవికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు అని గ్రామస్థులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.