బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (22:31 IST)

ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్స్.. (video)

mosquito coil
దేశ రాజధాని ఢిల్లీలో ఒక విషాదకర ఘటన జరిగింది. మస్కిటో కాయిల్స్ ఏకంగా ఆరుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఏరియాలో జరిగింది. దోమల కోసం రాత్రి సమయంలో పడక గదిలో పెట్టుకున్న మస్కిటో కాయిల్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్‌ వాయువు వెలువడటంతో ఆ గదిలో నిద్రించిన వారిలో ఆరుగురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
శాస్త్రి నగర్ ఏరియాలో ఓ కుటుంబం ఉంటుండగా, శుక్రవారం ఉదయం పొద్దెక్కినప్పటికీ వారు ఇంట్లో నుంచి బయటకురాలేదు. దీనికితోడు ఇంటి నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు పగులగొటటి వెళ్లి చూడగా అందరూ స్పృహ లేని స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. మరో ఇద్దరికి మాత్రం కాలిన గాయాలతో చికిత్స అందించారు. 
 
"రాత్రి సమయంలో తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి, మస్కిటో కాయిల్స్ వెలిగించారు. పరుపుపై మస్కిటో కాయిల్స్ పడటంతో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడటంతో దాన్ని పీల్చడంతో వారు చనిపోయారని వైద్యులు చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ మరణాల వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని వారు తెలిపారు.