గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (17:16 IST)

పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆస్తులు ఎన్నో తెలుసా? నాగబాబు వెల్లడి

nagababu
తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆస్తుల వివరాలను మెగా బ్రదర్, జనసేన పార్టీ నేత కె.నాగబాబు వెల్లడించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను బహిర్గతం చేశారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌కు వచ్చే ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయన్నారు. అతనికి ఉన్నదంతా అదొక్కటే ఆస్తి అని చెప్పారు. 
 
"అన్నయ్యని, తమ్ముడిని చాలా దగ్గరగా చూసినవాడిని నేను. సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉన్నవారు. అందుకోసం తమ డబ్బును కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కళ్యాణ్ బాబు విషయానికొస్తే తన ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉంటాయి. కళ్యాణ్ బాబు దగ్గర డబ్బులు లేవు. మళ్లీ అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఆయన. ఇల్లు కూడా బ్యాంకులో రుణం తీసుకుని కట్టుకున్నదే. కార్లు కూడా అంతే" అని చెప్పారు. 
 
"పవన్ తాను సంపాదించుకున్నదంతా ప్రజల కోసం పార్టీ కోసం అవసరమై అడిగినవారి కోసం ఇచ్చేస్తుంటారు. పవన్‌కు వ్యవసాయం చేయడమంటే అమితమైన ఇష్టం. అందువల్ల శంకర్‌పల్లిలో 8 లక్షలు పెట్టి అప్పట్లో 8 ఎకరాలు కొన్నాడు. అతనికి ఉన్న ఆస్తి అదొక్కటే. అది ఇపుడు రేటు పెరిగితే పెరగాలి తప్ప. అంతకుమించి అతనికి ఏమీ లేదు" అని అన్నారు.