సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలుడు

victim
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన ముజఫర్‌ నగర్ జిల్లాలో జరిగింది. 
 
దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ బాలికను నిందితుడు స్కూలు భవనం మిద్దెపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 
 
గత యేడాది ప్రారంభంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. 12 యేళ్ళ బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో బాలుడు అడ్డగించి, ఆమెకు చాక్లెట్లు కొనిస్తామని ఆశచూపి లైంగికదాడికి పాల్పడిన విషయం తెల్సిందే.