గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 మార్చి 2023 (13:02 IST)

మలయాళ నటి అనికాపై మాజీ ప్రియుడు దాడి: ఫోటోలు షేర్ చేసిన నటి

Anicka Vikhraman
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
మలయాళ నటి అనికా విక్రమన్ తన మాజీ ప్రియుడు తనపై దాడి చేసిన ఫోటోలను ఫేస్ బుక్‌లో పంచుకున్నారు. అతడు ఇంత భయంకరమైన మనిషి అని తనకు తెలియదనీ, తనపై దాడి జరిగిన విషయాల గురించి ఓపెన్‌గా చెప్పింది. తీవ్రంగా గాయపడి కన్ను ప్రాంతం, శరీరం నల్లగా కమిలిపోయినట్లున్న ఫోటోలను షేర్ చేసారు.
 
ఒక వివరణాత్మక పోస్ట్‌లో తన కష్టాలను వివరించింది అనికా. తను అనూప్ పిళ్లై అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా రిలేషన్లో వున్నానని పేర్కొంది. అలాంటి మనిషిని ఎప్పుడూ చూడలేదనీ, అతను తనపై ఇలా దాడి చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. తొలిసారి చెన్నైలో నన్ను కొట్టినప్పుడు, జరిగిన దానికి చింతిస్తున్నానంటూ తన కాళ్లపై పడి ఏడ్చాడనీ, మారాడులో అని కనికరించి వదిలేశానని తెలిపింది. ఐతే అతడు తనను రెండోసారి వేధించడంతో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాను.
 
రెండోసారి రిపీట్ చేయడంతో నేను ఫిర్యాదు చేసినా పోలీసులకు డబ్బులిచ్చి మేనేజ్ చేశాడు. పోలీసులు అతడి వెనకే వుండటంతో తనపై తరచుగా దాడి చేసాడని పేర్కొంది. ప్రస్తుతం అతడు న్యూయార్కులో వున్నాడని చెప్పిన అనిక తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం తను పూర్తిగా కోలుకున్నాననీ, ఇకపై అంతా బాగుంటుందని ఆశిస్తున్నానంటూ పోస్టులో వెల్లడించారు.