కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లో మరో చిరుత ప్రాణాలు కోల్పోయింది. గత నాలుగు నెలల్లోపు మగ చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చిరుతపై మెడ గాయాలను గుర్తించిన పర్యవేక్షణ బృందం వెంటనే పశువైద్యులను అప్రమత్తం చేసింది.
గాయాలకు చికిత్స చేయడానికి వారు ప్రయత్నించినప్పటికీ, తేజస్ అనే చిరుత ప్రాణాలు కోల్పోయింది. శవపరీక్ష పెండింగ్‌లో ఉన్నందున, మరణానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి పరిశోధనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జేఎస్ చౌహాన్ తెలిపారు.
కునో నేషనల్ పార్క్‌లో తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి.