శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (08:00 IST)

నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతా పారిపోయింది...

Cheetah
నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఆశా అనే పేరున్న మరో చిరుత కునో నేషనల్ పార్కు నుంచి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, జూ అధికారులు మాత్రం భయపాడాల్సిన పనిలేదని, చిరుతలు జనావాస ప్రాంతాల్లో సంచరించవని నమ్మపలుకుతున్నారు. అయినప్పటికీ బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం చిరుత భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. 
 
గత యేడాది సెప్టెంబరు నెలలో నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు ప్రత్యేక బోయింగ్ విమానంలో తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విడిచిపెట్టారు. భారత్‌లో అంతరించిపోయి జాతుల్లోకి చేరిన చీతాలను 74 యేళ్ల తర్వాత మళ్లీ మన దేశంలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో అవి నిర్ధేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్లిపోవడంతో అధికారులు ఆ చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.