శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (11:02 IST)

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు: 3,016మందికి పాజిటివ్

corona visus
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి. . కేరళలోని ఎర్ణాకులం, తిరువనంతపురం జిల్లాలు కేసుల సంఖ్య పరంగా టాప్‌లో ఉన్నాయి. గోవాలో గురువారం కొత్తగా 108 కేసులు వెలుగులోకి వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు కేంద్రం సూచన చేశారు. యూపీ నుంచి మహారాష్ట్ర వరకూ పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు అప్రమత్తం అయ్యాయి. 
 
ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్‌‌బీబీ వేరియంట్ కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, కొత్త వేరియంట్ ఏదీ వెలుగులోకి రాలేదని ఆయన భరోసా ఇచ్చారు.