శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-03-2023 తేదీ శుక్రవారం దినఫలాలు - లక్ష్మీ అష్టోత్రం చదివినా లేక విన్నా శుభం..

astro5
మేషం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయా లేర్పడతాయి. మీ సంతానం చేయు పనులు మీకెంతో చికాకులు కలిగిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదోక్కుకోవటానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. ఇతరులు వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.
 
వృషభం :- విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని సందర్భాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు పనివారితో సమస్యతలు తలెత్తుతాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. అధికంగా శ్రమించి అనుకున్న లక్ష్యాలు సాధించ గలుగుతారు. స్త్రీలు వస్త్ర, బంగారం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ముందుగానే ధనం సర్దుబాటు చేసుకోవటానికి యత్నించండి. ప్రత్తి, వ్యాపారాల్లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఒకానొక సందర్భంలో మీ ఆవేశపూరిత నిర్ణయాలు ఇబ్బందులకు దారి తీస్తాయి. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చెల్లని చెక్కులతో ఇబ్బందు లెదుర్కొంటారు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం గ్రహిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యమైనా ఆశించిన ప్రయోజనా లుండవు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
కన్య :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతోముఖ్యం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ, చిరువ్యాపారులకు కలిసివస్తుంది. పెట్టుబడుల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. లైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి.
 
తుల :- మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. విందు, వినోదాలలో పరిమితి చాలా అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకు పాల్గొంటారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు గడ్డుకాలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
వృశ్చికం :- విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరం. చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు.
 
ధనస్సు :- దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతిదూరం చేస్తారు. కొబ్బరి, పండ్ల, పూలు, చల్లని పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దమొత్తం ధనం, విలువైన వస్తువులతో ప్రయాణం క్షేమం కాదు.
 
మకరం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏ విషయంపైనా మనస్సులగ్నం చేయలేరు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు.పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీలు వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్, బ్రోకర్లకు, వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. పుణ్యకార్యాలకు సహాయ మందిస్తారు. బంధువులలో మంచి పేరు, ఖ్యాతిని గడిస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మీనం :- రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయాల వారికి పార్టీ పరంగా గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.