శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-03-2023 తేదీ గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం..

Astrology
మేషం :- భాగస్వామిక చర్చలు అనుకూలిస్తాయి. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. విద్యార్ధులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తువ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృషభం :- ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
మిథునం :- మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా రాబడి ఆశించినంతగా ఉండదు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారలకు కలిసివస్తుంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చోటుచేసుకుంటాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు.
 
సింహం :- కొత్త వ్యాపారాలు, పరిశ్రమలకు అనువైన వనరులు సమకూర్చుకుంటారు. సంస్థలు, పరిశ్రమల స్థాపనకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. అనుకున్న పనులలో జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
కన్య :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అధికభాగం విందు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలకై ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
 
తుల :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. స్థానమార్పిడి, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలుంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. విద్యార్థులు ఉన్నత చదువుల విషయమై ఒక నిర్ణయానికివస్తారు.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహరాల్లో మెలకువ వహించండి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, మెడికల్ క్లయిమ్‌లు మంజూరవుతాయి. కోర్టు వ్యవహరాలు ఆందోళన కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. 
 
మకరం :- మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఖర్చులు రాబడికి తగినట్లే ఉండటంతో ఇబ్బందులంతగా ఉండవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఆశించినంత సంతృప్తినీయవు.
 
కుంభం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. భాగస్వామిక చర్చల్లోకొంత పురోగతి కనిపిస్తుంది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు ఆశాజనకం. దస్త్రం వివాహ, శుభకార్యాలకు సంప్రదింపులు జరుపుతారు. మిమ్ములను చూసి అసూయపడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. చేపట్టిన పనులు ఆశించిన రీతిగా సాగవు. బంధువుల రాకతో అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు.