శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-03-2023 తేదీ బుధవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా సర్వదా శుభం..

astro4
మేషం :- వృత్తి, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. మీ జీవితభాగస్వామి సలహా పాటించటం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.
 
మిథునం :- వ్యాపారంలో ఎంతో పక్కగా తయారు చేసుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు. పాత మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వ్యవహారాలలో కొంచెం నిదానం అవసరం. 
 
కర్కాటకం :- బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సంయమనం పాటించండి. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తికానరాదు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
సింహం :- దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, చికాకులు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం.
 
కన్య :- రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాలు, బ్యాంకుపనుల్లో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
తుల :- బంగారు, వెండి ఆభరణాల వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ నాయకులు తరచుసభా సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. 
 
వృశ్చికం :- స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునప్పుడు జాగ్రత్తవహించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
ధనస్సు :- స్త్రీలకు టీవీ ఛానెళ్లనుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. షాపు గుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. మీ గౌరవ, ఆత్మాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం.
 
మకరం :- మీ ఆశయం నెవవేరడానికి బాగా శ్రమిచవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు.
 
కుంభం :- పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహరాల్లో మీ జీవితభాగస్వామి సలహా ఎంతగానో ఉపకరిస్తుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వాహనం కొనుగోలుకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. 
 
మీనం :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తలవల్ల చికాకులు తలెత్తుతాయి. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.