శుక్రవారం, 14 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-03-2023 తేదీ ఆదివారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

astro1
మేషం :- ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. మీ మాటకు ఇంటా, బయటా గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృషభం :- దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ఆహార వ్యవహారాలలో, ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. స్థిర, చరాస్తుల విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. శుభకార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి పథకాలు వేస్తారు.
 
కర్కాటకం :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. రవాణా రంగాలలోని వారికి లాభదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం :- విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. రావలసిన పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు.
 
కన్య :- దస్త్రం వివాహ, శుభకార్యాలకు సంప్రదింపులు జరుపుతారు. గతంలో వాయిదా పడిన పనలు పునఃప్రారంభమవుతాయి. మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల రాకతో ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
తుల :- బంధువులు, కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కొచ్చిన సమస్య చిన్నదే అయినా చికాకులు తప్పవు. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పట్ల ఆస్తి పెరుగుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
వృశ్చికం :- వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికివస్తాయి. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- కుటుంబ సభులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. ఒకానొక సందర్భంలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు మార్చుకోవలసివస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
మకరం :- కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు ఎదుర్కొంటారు. ఆలయాలను, నూతన ప్రదేశాలను సందర్శిస్తారు.
 
కుంభం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఖర్చులు అధికం కావటంతో ఒకింత ఒడిదుడుకులకు లోనవుతారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
మీనం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కొబ్బరి, పండుల, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు.