ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-03-2023 - సోమవారం రాశిఫలాలు - సుందరకాండ పారాణయం చేయడంవల్ల మీకు శుభం..

astro2
మేషం :- ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ మాటతీరు, పద్ధతులు ఎదుటి వారికి కష్టం కలిగిస్తాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. 
 
వృషభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు పెద్దమొత్తంలో రణమిచ్చే విషయంలో పునరాలోచన అవసరం. మీ మేదస్సుకి, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది.
 
మిథునం :- మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. క్రయ, విక్రయాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి.
 
కర్కాటకం :- ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు, విస్తరిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితులతోకలసి సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
సింహం :- అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. అకౌంట్స్, ఇంజనీరింగ్ రంగాల వారికిపని భారం తప్పవు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసి వస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు స్వీయఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి.
 
కన్య :- నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. సోదరీ, సోదరుల మధ్య బాంధవ్యాలు మానసికనందాన్ని కలిగిస్తాయి. 
 
తుల :- మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాల గ్రహిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు ఇతరులకు సలహా ఇవ్వటంవల్ల మాట పడక తప్పదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హజరు కావడం మంచిది. ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. దస్త్రం వివాహ, శుభకార్యాలకు సంప్రదింపులు జరుపుతారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు :- కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
మకరం :- దైవ, సేవా కార్యాల పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం :- బ్యాంకు వ్యవహరాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వటం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి.
 
మీనం :- స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రతా సమస్యలెదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు వరకు మితంగా సంభాషించడం మేలు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.