సంబంధిత వార్తలు
- ఎఫ్ 3- .షూటింగ్ హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం
- విజయ్ ఆంటోని ఆవిష్కరించిన రాయ్‌లక్ష్మి - సిండ్రెల్లా టీజర్
- సినిమా టికెట్ల ఆన్లైన్ సీక్రెట్ చెప్పేసిన మంత్రి నాని
- `పాగల్` సక్సెస్‌తో నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను: బెక్కెం వేణుగోపాల్
- నేను పేరు మార్చుకోవలసిన అవసరం లేదు. నన్ను ప్రేక్షకులు నమ్మారు: విశ్వక్ సేన్
క్లీన్ యూ సర్టిఫికేట్ తో దృశ్యం 2 సెన్సార్ పూర్తి
drushyam 2
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అందరూ వీక్షించవచ్చని తెలుస్తోంది. దృశ్యం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
మొదటి పార్ట్‌లో కనిపించిన మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ఇలా అందరూ కూడా సీక్వెల్‌లో నటిస్తున్నారు. ఇక సంపత్ రాజ్, పూర్ణలు కొత్తగా సీక్వెల్‌లో కనిపించబోతోన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ పార్ట్ ఎంతో ఉంది. వెంకటేష్ నటన అందరినీ మెస్మరేజ్ చేయబోతోంది.
నటీనటులు: మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణలు
సాంకేతిక బృందంః దర్శకుడు: జీతూ జోసెఫ్, నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్, సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరామెన్: సతీష్ కురూప్
తర్వాతి కథనం
