'డియర్ కామ్రేడ్' హిందీ డబ్బింగ్‌కు భారీ రెస్పాన్స్.. 160 మిలియన్ వ్యూస్
Dear Comrade
తాజాగా డియర్ కామ్రేడ్ హిందీ అనువాదానికి యూట్యూబ్‌లో భారీ స్పందన లభిస్తుంది. ఈ చిత్రానికి 160 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా, 2 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి ఈ స్థాయిలో లైక్స్ రాలేదని అంటున్నారు.
గోల్డ్ మైన్స్ టెలి ఫిలింస్ సంస్థ హిందీ అనువాద హక్కులని కొనుగోలు చేసి ఈ ఏడాది జనవరి 19న యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి 2 మిలియన్ లైక్స్ రావడంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
