శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (17:05 IST)

పీవీ సింధు బయోపిక్.. దీపికా పదుకునే లీడ్ రోల్ చేస్తుందా..?

బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సంచలనం పీవీ సింధు బయోపిక్‌పై సినిమా రానుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకుని వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిన ఈ భామ బయోపిక్ చేయడానికి బాలీవుడ్‌లో పావులు కదుపుతున్నారు దర్శక నిర్మాతలు.

ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది కూడా. అయితే ఈ విషయంపై తన బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుందని పివి సింధును కూడా అడిగారు మీడియా మిత్రులు. దానికి మరో ఆలోచన లేకుండా దీపిక పదుకొనే అనే సమాధానం ఇచ్చింది పీవీ సింధు. దానికి కారణం కూడా లేకపోలేదు. 
 
ఒకప్పుడు దీపిక కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే.. పైగా ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొనే ఒకప్పుడు భారత్‌కు పతకం సంపాదించిపెట్టాడు. దాంతో అలవాటు ఉన్న గేమ్ కాబట్టి తన పాత్రలో దీపిక అయితే బాగుంటుందని చెప్పింది సింధు. మరోవైపు పుల్లెల గోపీచంద్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందనే వాదనకు తెరతీస్తూ.. అక్షయ్ కుమార్ అనే సమాధానం వచ్చింది. మొత్తానికి పివి సింధు బయోపిక్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. 
deepika padukone
 
ప్రస్తుతం పీవీ సింధు రోల్‌లో కనిపించేందుకు దీపికా పదుకునే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ వస్తోంది. ఇప్పటికీ ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా పదుకునే ఖరారైన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఈ బాలీవుడ్ భామ నటించనుంది.