ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (16:34 IST)

అటు షారూక్ ఇటు ప్రభాస్.. మధ్యలో దీపికా పదుకొనె!

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా "రాధేశ్యామ్" అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ 21వ మూవీ పట్టాలపైకి వెళ్లనుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌గా దీపికా పదుకొనేను ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం ఈ అమ్మడు ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తన సొంత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. దీంతో దీపికా మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. అది బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చిత్రానికి. 
 
ఈ బ్యూటీ చ‌పాక్ చిత్రం తర్వాత గత యేడాది కాలంగా కెమెరా ముందుకు వెళ్లలేదు. అయితే ఈ కాలంలో దీపికా ప‌దుకొనే మొద‌ట త‌న డేట్స్‌ను షారుక్‌ఖాన్‌తో న‌టించ‌నున్న ప‌ఠాన్ సినిమా‌కు కేటాయించింది. మ‌రో వైపు ప్ర‌భాస్ సినిమాకు సంత‌కం కూడా చేసింది. 
 
కానీ దీపికా వెంట‌నే షారుక్ సినిమా షూటింగులో జాయిన్ అయ్యేందుకు సిద్ద‌మ‌వుతుంద‌ట‌. న‌వంబ‌రులో షారుక్ ఖాన్ సినిమా షూటింగును షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పఠాన్ పూర్తయిన తర్వాత ప్రభాస్ చిత్ర యూనిట్‌తో దీపిక పదుకొనే జాయిన్ కానుందట.