1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:10 IST)

విజృంభిస్తోన్న కరోనా.. 60వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా 60వేలుకు పైగా కేసులు నమోదు కాగా.. మంగళవారం కాస్తా తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, 871 మంది కరోనాతో మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
కొత్తగా నమోదైన కేసులుతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 22,68,676కు చేరుకుంది. అందులో దీంట్లో 15,83,490 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 6,39,929 మంది చికిత్స పొందుతున్నారు.
 
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసులు 28.21 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. 69.80 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అటు, మరణాల రేటు1.99 శాతంగా ఉంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైనా.. కరోనా రికవరీ రేటు మాత్రం గణనీయంగా నమోదవుతుంది.