శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (17:13 IST)

ఏపీలో 193 కరోనా పాజిటివ్ కేసులు : దేశంలో 10,215

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే, రాష్ట్రంలో కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో ఏపీలో మరో 193 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, కరోనా వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిత్తూరులో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు ఉన్నారు. ఈ రెండు మరణాలతో కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి పెరిగింది. కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,280కి చేరింది. ఇప్పటివరకు 2,851 మంది డిశ్చార్జి కాగా, 2,341 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 81 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కేంద్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు, గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదేసమయంలో 10,215 మంది రికవర్ కాగా, 380 మంది మరణించారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా, 1,80,013 మంది రికవర్ అయ్యారని, 9,900 మంది మరణించారని అధికారులు గణాంకాలను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నట్లయింది.