సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (09:43 IST)

#ripPranabMukherjee హ్యాష్‌ట్యాగ్.. తండ్రి ఆరోగ్యం నిలకడగా వుందన్న ప్రణబ్ కుమారుడు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసారని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కరోనాతో పోరాటం చేస్తున్న ఆయన తుది శ్వాస విడిచారని వార్తలు వస్తున్నాయి. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం గత నాలుగు రోజులుగా విషమంగా ఉంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే ఆయన మరణించినట్టు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ట్విట్టర్‌లో పలువురు ట్వీట్‌లు చేస్తున్నారు.
 
రిప్ ప్రణబ్ ముఖర్జీ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఆయన రాష్ట్రపతిగా సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ నుంచి కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నారు. ఇందిరా కేబినేట్‌లో, రాజీవ్ కేబినేట్‍‌లో, పీవీ కేబినేట్‌లో మన్మోహన్ సింగ్ కేబినేట్ లో కీలక శాఖలు నిర్వహించారు.
 
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కరోనా వైరస్ బారిన పడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ కోసం ఆయన సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. అందులో కరోనా పాజిటివ్ తేలింది. తరువాత ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
 
బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన బుధవారం రాత్రి మరణించారని వార్తలు వచ్చాయి. దీంతో అందరు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేయడం మొదలు పెట్టారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనకు సంతాపం తెలిపారు. దీంతో ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించండి పేర్కొన్నారు.