సంబంధిత వార్తలు
- టాలీవుడ్లో మరో డైరెక్టర్‌కి కరోనా, ఇంతకీ ఎవరా డైరెక్టర్..?
- #ripPranabMukherjee హ్యాష్‌ట్యాగ్.. తండ్రి ఆరోగ్యం నిలకడగా వుందన్న ప్రణబ్ కుమారుడు
- మా కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగెటివ్ : ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్
- అడ్డంగా బుక్కైన వర్మ, అమృత ఆర్జీవిని కోర్టు బోనులో నిలబెడుతుందా? (video)
- తెలంగాణాలో తగ్గని కరోనా దూకుడు : కొత్తా 1897 పాజిటివ్ కేసులు
భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. రికార్డు స్థాయిలో 66,999 కేసులు
భారత్‌లో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకీ కేసులు కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 లక్షల 96 వేలు దాటింది. అలా మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,645 కేసులు నమోదయ్యాయి.
ఇక గడిచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 942 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 47,033కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,383 కాగా ఈ ఇప్పటి దాకా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,95,982కు చేరింది.
