శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:47 IST)

తెలంగాణాలో తగ్గని కరోనా దూకుడు : కొత్తా 1897 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా మరో 1897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 84,544కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 654కి చేరింది. 
 
ప్రస్తుతం 22,596 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తాజా మరో 1920 మంది కోలుకోగా, 61,294 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో రికవరీ రేటు 72.49 శాతంగా ఉందని, ఇది దేశ సగటుకు కంటే ఎక్కువ అని పేర్కొంది. అలాగే మరణాల రేటు 0.77 శాతంగా ఉందని వివరించింది. తాజాగా నిర్ధారణ అయిన కేసు అత్యధిక కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 479 కేసులు ఉండగా, రంగారెడ్డిలో 162, సంగారెడ్డిలో 107 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి.
 
అలాగే, ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు అటూఇటుగా 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 9,024 కేసులు నమోదయ్యాయి. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత 24 గంటల్లో 58,315 మంది శాంపిల్స్‌ని పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,372 కేసులు నమోదు కాగా తర్వాతి స్థానంలో కర్నూలు 1,138 కేసులతో ఉంది. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి.
 
తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,203కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,597 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.