60వేల మందికి కరోనా.. ఒక్కరోజే 933మంది మృత్యువాత

corona deaths
corona deaths
సెల్వి| Last Updated: శనివారం, 8 ఆగస్టు 2020 (11:01 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనంతగా వరుసగా రెండో రోజూ 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది.

దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.04%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు, కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14లక్షలు దాటేసింది. ప్రస్తుతం రికవరీ అయిన వారి సంఖ్య 14,27,006గా ఉంది. దేశంలో ప్రస్తుతం 6,19,088 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో రికవరీ రేటు 68.32శాతంగా ఉంది.

మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. నిన్న ఒక్క రోజే 5,98,778 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వెల్లడించింది .దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,33,87,171 శాంపిల్స్‌ను పరీక్షించారు.దీనిపై మరింత చదవండి :