శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:03 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,171 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,065కి చేరింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,17,569 మంది కోలుకున్నారు. 
 
గత 24 గంటల్లో 62,938 నమూనాలు, ఇప్పటి వరకు 23,62,270 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 1842కు చేరింది.