శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (19:58 IST)

మా ఇంట్లో తుమ్మినా దగ్గినా భయపడుతున్నారు.. చివరకు సురేఖ కూడా: చిరంజీవి

ఫ్లాస్మా దానం చేసిన ఫ్లాస్మా యోధులకు సైబరాబాద్ పోలీసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. తన ఇంట్లో పనిచేసే వంటమనిషి, స్విమ్మింగ్ పూల్ కేర్ టేకర్‌కు, ఇలా మరో ఇద్దరికి కరోనా వచ్చిందని వారు కూడా ప్లాస్మా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని తెలియజేశారు.
 
వీరికి కాయగూరలు ద్వారా కరోనావైరస్ వచ్చి ఉంటుందని, కూరగాయలు కోసే సందర్భంలో సరిగా కడకకుండా కోసి ఆ చేతులు ముఖానికి తగలడం ద్వారా వచ్చి ఉంటుందని చెప్పారు చిరంజీవి. మాటల సందర్భంలో చిరంజీవికి దగ్గు రావడంతో ఇది మామాలు దగ్గు మాత్రమేనని, దయచేసి ఎవరూ భయపడవద్దు అని తనదైన శైలిలో చిరంజీవి చెప్పడం..  తరువాత మా ఇంట్లో పొరబాటున తుమ్మినా, దగ్గినా కూడా దూరంగా వెళ్లిపోతున్నారని అనడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.
 
చివరకు సురేఖకు కూడా పొరబాటున నా చేయి తగిలితే సామాజిక దూరం పాటించండి అంటుందని చెప్పడంతో అక్కడ నవ్వులు పువ్వులు పూసాయి. చిరు మాటలకు సైబరాబాద్ కమిషన్ సజ్జనార్ అయితే పగలబడి నవ్వుకున్నారు.