బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (14:00 IST)

ప్రభాస్ సినిమాలో నివేదా థామస్.. వకీల్ సాబ్‌లోనూ తాప్సీ రోల్‌లో‌..?

సాహో సినిమాకు తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్‌ షూటింగ్‌‌లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు తదుపరి చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించబోయే చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన రోజుకొక ఆసక్తికరమైన అప్ డేట్ వస్తోంది.
 
ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా దీపికా పదుకునె నటిస్తుందని ప్రకటించారు. సంగీత దర్శకునిగా ఎ.ఆర్‌. రెహమాన్‌‌పై స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాలో నివేదా థామస్‌ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈతరం నాయికల్లో మంచి అభినయం ప్రదర్శించే నటిగా నివేదకు పేరుంది. రజనీకాంత్‌ దర్బార్‌ సినిమాలో నటించింది. నివేద పాత్ర గురించి చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కుతుందని తెలిసింది. 
 
ఇకపోతే.. నివేదా థామస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలోనూ నటిస్తోంది. హిందీ పింక్ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర కోసం తెలుగులో నివేదా థామస్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.