గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (13:27 IST)

ప్రభాస్ చేతుల మీదుగా గుడ్ లఖ్ సఖి ట్రైలర్ అదుర్స్.. వీడియో చూడండి..

Sakhi
మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా సఖి అనే సినిమాలో నటిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్‌‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్‌ని ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు.
 
నిమిషం రెండు సెకండ్స్ ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో కీర్తి సురేష్ నటనతో మరోసారి ఫిదా చేసేలాగా ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించింది. కీర్తి సురేష్‌తో పాటుగా ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తం మూడు భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. ఈ టీజర్ సినీ ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ సంపాదించింది.