ప్రభాస్ చేతుల మీదుగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫస్ట్ లుక్ లాంచ్
ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేసారు.
త్వరలోనే ఓటిటిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభినందనలు తెలియజేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ... ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా అందరికి నచ్చేలా కంప్లీట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది అన్నారు.
ఫైనల్ అవుట్‌పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదరించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామన్నారు నటుడు, నిర్మాత కృష్ణుడు. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా తెలుగుతెరకు చేస్తున్నారు.