శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (17:51 IST)

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్.. మీసాలు తీసేసి కుర్రాడిలా..!

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ ఫోటోలో వున్నది చిరింజీవేనా? కాదా? అని గిల్లి చూసుకుంటున్నారు. ఆ ఫోటోలో బరువు తగ్గిపోయి.. మీసాలు తీసేసి కుర్రాడిలా మారిపోయాడు.. మెగాస్టార్. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 64 ఏళ్ల వయసులో అన్నయ్యను అలా చూసి అభిమానులు సూపర్ బాసూ అంటూ ఫిదా అయిపోతున్నారు.
 
లాక్‌డౌన్ సమయంలో ఫిజిక్ విషయంలో మరింత కాన్సట్రేషన్ పెట్టాడు మెగాస్టార్. అందులో భాగంగానే ఎప్పుడూ జిమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు చిరంజీవి. తాజాగా మెగా లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 
 
బ్లాక్ మాస్టర్ దర్శకుడు గోపీ గణేష్ ఈ మధ్యే చిరంజీవిని కలిశాడు. దాంతో ఆయన పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో చిరంజీవి మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ చిత్రం తర్వాత లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు.