ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జులై 2020 (12:05 IST)

కేజీఎఫ్ ఛాప్టర్ 2.. సంజయ్ దత్ లుక్ ఇదే.. అదిరిందిగా..!

Adheera
కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 విలన్ అధీరా ఫస్ట్ లుక్ విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. చెప్పినట్లే సంజయ్ దత్ లుక్ అధిరింది. కేజీఎఫ్2లో  సంజయ్ దత్ అధీరా పాత్ర చేస్తున్నాడు. 
 
ఇంకా జూలై 29 సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు మేకర్స్. కాగా కన్నడ యాంగ్రీయంగ్ మేన్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మాణ దశలో ఉంది. అక్టోబర్‌లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 
 
వచ్చే నెల‌లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు సమాచారం, ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉంద‌ని తెలుస్తుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌లువురు ప్ర‌ముఖులు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.