శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (18:41 IST)

'ప్రస్థానం' థియేట్రికల్ ట్రైలర్ చూడండి.. ఎలా ఉందో మీకే తెలుస్తుంది?

డైలాగ్ కింగ్ సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ నటించిన 'ప్రస్థానం' సినిమా ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రస్థానం (ఎర్న్ ది లెగసీ) పేరుతో రీమేక్ అవుతున్న సంగతి విదితమే. దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలుగులో సాయికుమార్ చేసిన పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 
 
తాజాగా ప్రస్థానం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో డైరెక్టర్ దేవ్ కట్టా తాను చెప్పాలనుకున్న అంశాన్ని క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేసాడు. సంజయ్ దత్ సెటిల్డ్ పర్ఫార్మన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. విజువల్స్‌తో పాటు ఆర్ఆర్ కూడా బాగుంది. దేవ కట్టా స్టోరీలోని ప్రధానాంశం మిస్ కాకుండా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
సంజయ్ దత్ సమర్పణలో ఆయన భార్య మాన్యతా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మనీషా కోయిరాలా, జాకీష్రాఫ్, చుంకీ పాండే, అలీ ఫాజల్, సత్యదేవ్ దూబే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 20వ తేదీన విడుదల కానుంది. 'మ్యాస్ట్రో' ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు, చాలా రోజుల తర్వాత ఇళయరాజా హిందీ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.