సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:08 IST)

మీకు టీజర్‌కి, ట్రైలర్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? (video)

సాధారణంగా మనకు నచ్చిన హీరోల సినిమాలు వస్తున్నాయంటే..ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ టీజర్, టీజర్, ఇంకా ట్రైలర్ అంటూ అభిమానులను సినిమా దర్శకనిర్మాతలు ఊరిస్తుంటారు. టీజర్, ట్రైలర్ వ్యూస్ విషయంలో అభిమానులు ఆన్‌లైన్‌లో చిన్న పాటి యుద్ధం చేస్తుంటారు. యూట్యూబ్ రికార్డ్‌ల కోసం తెగ ఆరాటపడుతుంటారు. 
 
మా హీరో సినిమా టీజర్ ఇన్ని వ్యూస్ సొంతం చేసుకుందని కొంత మంది అభిమానులు వేరొక హీరో రికార్డ్‌లతో పోల్చుకుని సంబరపడిపోతుంటారు. కానీ అభిమానులలో చాలా మందికి టీజర్‌కి, ట్రైలర్‌కి డిఫరెన్స్ తెలియదు. అసలు ఈ టీజర్, ట్రైలర్ కథేంటో ఓసారి చూడండి..
 
టీజర్ అంటే ఇంగ్లీషులో ఊరించి ఆకట్టుకోవడం అని అర్థం.. ఇది సాధారణంగా ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ నిడివిని కలిగి ఉండి, తక్కువ విజ్యువల్స్ కలిగి ఉంటుంది, అలాగే చిత్రానికి సంబంధించిన విషయాలు ఎక్కువ బయటపెట్టకుండా వచ్చే డైలాగ్‌లను కలిగి ఉంటుంది. టీజర్‌లు చిత్రానికి సంబంధించి ప్రేక్షకులలో ఆత్రుత పెంచుతాయి.
 
ట్రైలర్‌లు టీజర్ కంటే కొంత ఎక్కువ నిడివిని కలిగి ఉంటాయి. వీటిలో మరింత సమాచారం తెలియజేయబడుతుంది. వీటిలో స్టోరీ లైన్‌తో పాటు సందేశం కూడా ఉంటుంది. టైలర్‌లు 2-2 1/2 నిమిషాల నిడివిని కలిగి ఉంటాయి. టైలర్‌లో మరికొన్ని డైలాగ్‌లు, అలాగే చిత్రానికి సంబంధించిన మరికొంత కథనాన్ని కొద్దిగా తెలియజేస్తారు. టీజర్ మరియు ట్రైలర్‌ల కోసం సినిమాలో నుండి అక్కడక్కడ వచ్చే సన్నివేశాలతో పాటు పాటలను కూడా జోడించి రిలీజ్ చేస్తుంటారు. చిత్రబృందం వీటిని సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగిస్తుంటుంది. 
 
అభిమానుల దృష్టిని ఆకర్షించే విధంగా సినీ దర్శకులు ట్రైలర్ మరియు టీజర్‌లను రూపొందిస్తుంటారు. ప్రస్తుతం బడా హీరోల సినిమాలు రిలీజు అవుతుందంటే అభిమానుల మధ్య ఆన్‌లైన్‌లో టీజర్, ట్రైలర్‌ల గొడవ షురూ అవుతుంది. ఆన్‌లైన్‌లో రికార్డ్‌ల వేట కొనసాగుతుంది.