'సైరా నరసింహా రెడ్డి' అంటూ గర్జిస్తున్న పవర్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం టీజర్ ఈ నెల 20వ తేదీ మంగళవారం విడుదలకానుంది. అయితే, సోమవారం క్రితం ఈ చిత్రం ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
కాగా, ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన దృశ్యాలతో టీజర్ ప్రోమోను తయారు చేశారు. చిరంజీవితో కలిసి సినిమాను చూస్తూ పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సీన్స్ ఇందులో ఉన్నాయి. 'సైరా నరసింహారెడ్డి' అని పవన్ ఆవేశంతో చెప్పడం కనిపిస్తుంది. టీజర్ ప్రోమోను మీరూ చూడవచ్చు.