శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (11:35 IST)

జబర్దస్త్ కామెడీ షోకి బైబై చెప్పనున్న ఎమ్మెల్యే రోజా?

జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సినీనటి, ఎమ్మెల్యే రోజా. పదేళ్లలో వంద సినిమాలకు పైగా నటించిన రోజా.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైకాపాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రోజా, తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతోంది. 
 
మరోవైపు జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జీగా కూడా వ్యవహరిస్తున్నార. ఇవే కాకుండా మరికొన్ని టీవీ షోలకు కూడా హోస్టుగా ఉంది రోజా. ఇలా తీరిక లేని షెడ్యూల్‌తో కాలం గడిపేస్తున్న రోజాగారు.. ఇకపై జబర్దస్ షోకు జడ్జిగా వ్యవహరించబోరని టాక్ వస్తోంది. ఇందుకు కారణంగా ఆమెపై పెరిగిన బాధ్యతలేనని.. ఇప్పటికే ఏపీఐఐసి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా.. మరింత బిజీ అయిపోయారు.
 
ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రోజా తన కాల్షీట్స్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎంపికైన తర్వాత రోజా పాత్ర పార్టీలో ఎక్కువైపోయింది. అందుకే జబర్దస్త్ షో నుంచి తప్పుకునే యోచనలో రోజా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.